ఫీజు బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:52 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువార ం గోదావరిఖనిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా రాజేష్ థియేటర్ సర్కిల్ వద్ద నాయకులు నిరసన తెలిపారు.
కోల్‌సిటీటౌన్, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువార ం గోదావరిఖనిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా రాజేష్ థియేటర్ సర్కిల్ వద్ద నాయకులు నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేవైఎం పోరాటం కొనసాగిస్తుందన్నారు. హర్ష, శిలారపు కళ్యాణ్, సాయికుమార్, రవితేజ, రాహుల్, అంజి పాల్గొన్నారు.