Share News

రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:43 AM

రైతుల సం క్షేమం, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించమే సంఘం ప్రాధాన్యమని సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాయలంలో శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.

రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

మంథని, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతుల సం క్షేమం, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించమే సంఘం ప్రాధాన్యమని సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాయలంలో శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సభ్యుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటూ సంఘాన్ని బలోపే తం చేస్తున్నామన్నారు. సహకార సంఘం ద్వారా రైతు లకు పంట రుణాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు సేవలు అందిస్తున్నామన్నారు. రబీ సీజన్‌లో 36 కేంద్రా లు నిర్వహించి 5.05 లక్షల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సహకారంతో గుంజపడుగు శివారులో రూ.3.40 కోట్లతో పీఎం కుసు మ్‌ ద్వారా సోలార్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేసుకున్నా మన్నారు. ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న మాట్లా డుతూ.. ప్రజా ప్రభుత్వంలో ధాన్యం విక్రయాల్లో ఎలాం టి కోతలు లేకుండా కొనుగోళ్ళు చేపడుతున్నామన్నారు. సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్య సంఘ జమ, ఖర్చుల వివరాలను చదివి వినిపించారు. టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్‌ కాచే మాట్లాడారు. సంఘ మాజీ కార్యదర్శి మామిడాల అశోక్‌ కుమార్‌ మృతికి సం తాపం ప్రకటించారు. డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్ది రాజు ప్రభాకర్‌, రావికంటి సతీష్‌ కుమార్‌, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్‌ రెడ్డి, కొత్త శ్రీనివాస్‌, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి -పర్వతాల్‌ యాదవ్‌, దేవళ్ల విజయ్‌ కుమార్‌, కౌన్సిలర్‌ మాచిడి రాజు గౌడ్‌, మాజీ డైరెక్టర్‌ ఇనుముల సతీష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:43 AM