Share News

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:19 PM

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దకల్వల, తుర్కలమద్దికుంటలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దకల్వల, తుర్కలమద్దికుంటలో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులు ధర తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతుండడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. రైతుకు బయట అధిక ధర వస్తే అక్కడ కూడా అమ్ముకోవచ్చన్నారు. కొనుగోలు కేంద్రాలలో క్వింటాలకు 2462 రూపాయల మద్దతు ధరతో 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్‌ అందిస్తుందన్నారు. తూకంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. తుఫాను ప్రభావం ఉందని రైతులు పంటలు కోసిన తర్వాత పాలిథిన్‌ కవర్లు కప్పుకోవాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ ముత్యాల నరేష్‌, మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి సుధాకర్‌రెడ్డి , సర్పంచ్‌ నర్ల కనుకమ్మ-పోల్‌రాజు, మాజీ సర్పంచ్‌ కారెంగల రమేష్‌, అర్కుటి సంతోష్‌, రాజేందర్‌, ఆడెపు వెంకటేషం,రాజయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:19 PM