రైతులు పంట మార్పిడి పద్ధతి పాటించాలి
ABN , Publish Date - May 02 , 2026 | 11:38 PM
రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలని వ్యవసాయ పరిశో ధన స్థానం కూనారం ముఖ్య సీనియర్ శాస్త్రవేత్త సతీష్‌చంద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంట మార్పిడి పాటించండి... సుస్థిర ఆదాయాన్ని పొందండి అనే అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.
ఎలిగేడు, మే 2(ఆంధ్రజ్యోతి): రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలని వ్యవసాయ పరిశో ధన స్థానం కూనారం ముఖ్య సీనియర్ శాస్త్రవేత్త సతీష్‌చంద్ర అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంట మార్పిడి పాటించండి... సుస్థిర ఆదాయాన్ని పొందండి అనే అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరు వులు వాడాలని, పంట మార్పిడి ద్వారా భూమిలో సాంద్రత పెరగడంతోపాటు చీడపీడల సమస్య రాద న్నారు. రైతువిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేం ద్రప్రసాద్ మాట్లాడుతూ అవసరం మేరకు రసాయన మందులను వాడాలని, పంటల ఖర్చును తగ్గించుకో వాలన్నారు. మండల వ్యవసాయ అధికారి ఉమాపతి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు తెలిపిన రకాలను సాగు చేయాలన్నారు. ఆయిల్‌పామ్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్, మండల వ్యవసాయ అధి కారి ఉమాపతి, ఉద్యానవన విస్తరణ అధికారులు సురేష్, గణేష్, శరణ్య పాల్గొన్నారు.
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): విలేజ్ రామగుండంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవే త్తలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన సదస్సు లో ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిం చారు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యం, పంటమార్పిడి వల్ల కలిగే లాభాలు, అధిక రసాయనాల వల్ల కలిగే నష్టాలపై వివరించారు. రైతులు క్షేత్రపర్యటనలు చేయడం వల్ల కొత్తరకం విత్తనాలు, ఆధునిక యం త్రాల పనితీరుపై అవగాహన పెరుగుతుందని మం డల వ్యవసాయ అధికారి ప్రకాష్ తెలిపారు. శాస్త్రవే త్తలు రత్నాకర్, యామిని, రైతులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): రైతులు సేంద్రియ ఎరువుల వాడాలని పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జయంత్, వేణుగోపాల్ అన్నారు. కొదురుపాక పంచాయతీ కార్యాలయంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారాన్ని పరిరక్షిం చుకోవాలని సూచించారు. మండల వ్యవసాయాఽ దికారి పైడితల్లి మాట్లాడుతు రానున్న వానకాలం పంటల సాగు వివరాలను తెలుపుతూ వరి పంట లకు సంబంధించి అనువైన రకాల ఎంపికపై రైతు లకు ఆవగాహన కల్పించారు. యూరియాను తక్కువ మోతాదులో వాడుతూ నానో వాడకం గురించి అవ గాహన కల్పించారు. సర్పంచ్ సట్టు ఉత్తమకుమారి, ఏఈఓ ప్రశాంత్ పాల్గొన్నారు.