భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:44 PM
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేకు రైతులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాచాపూర్‌లో నిర్వహిస్తున్న భూముల రీ సర్వేను గురువా రం పరిశీలించారు.
జూలపల్లి నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేకు రైతులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కాచాపూర్‌లో నిర్వహిస్తున్న భూముల రీ సర్వేను గురువా రం పరిశీలించారు. పనుల పురోగతిపై వివరా లను తహసీల్దార్ దత్తు ప్రసాద్‌రావు, నాయ బ్ తహసీల్దార్ అనిల్‌కుమార్‌లను తెలుసుకు న్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో భూముల రీసర్వేను చేపట్టే ముందు రైతు లకు సమాచారం అందిస్తామని, సర్వే పూర్త యిన తర్వాత వివరాలను గ్రామంలో ప్రకటి స్తామన్నారు. వాటిపై అభ్యంతరాలు ఉన్న రైతులకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ వెల్ల డించారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యాప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యార్థులకు అల్పాహారం సక్ర మంగా అందించేలా అధికారులు పర్యవేక్షిం చాలని కలెక్టర్ ఆదేశించారు.
ధర్మారం, (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేకు రైతులు సహరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. శాయంపేటలో జరుగుతున్న భూ సర్వేతో పాటు, చామనపల్లిలో సోషల్ ఎకనామిక్ సర్వేను పరిశీలించారు. భూ సర్వే చేస్తున్న గ్రామాల్లో రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, రైతులు అందు బాటులో ఉండి తమ భూముల హద్దులను అధికారులకు చూపించి సహరించాలని కోరారు. రైతులు అందుబాటులో లేకుంటే, జియో కోఆర్డినేట్ల ఆధారంగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. చామనపల్లిలో జరుగుతున్న సోషల్ ఎకనామిక్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అధికారు లను ఆదేశించారు. అర్హులైన ప్రతీ కుటుం బానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి అందేలా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాస్, శాయంపేట సర్పంచ్ శ్రీవాణి, చామనపల్లి సర్పంచ్ రేవతి ఉన్నారు.