Share News

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:02 AM

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని రామయ్యపల్లి సర్పంచ్‌ మూల మంగ కోరారు. శుక్రవారం రచ్చపల్లికి చెందిన గాగిరెడ్డి సునంద, హేమలత వ్యవసాయ క్షేత్రంలోని 6 ఎకరాల్లో మొక్కలను నాటారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలి

ధర్మారం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని రామయ్యపల్లి సర్పంచ్‌ మూల మంగ కోరారు. శుక్రవారం రచ్చపల్లికి చెందిన గాగిరెడ్డి సునంద, హేమలత వ్యవసాయ క్షేత్రంలోని 6 ఎకరాల్లో మొక్కలను నాటారు. గ్రామాల్లో నీటి వసతి ఉన్న రైతులు సాగుకు ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2022లో నాటిన తోట రెండో కాపు కొత కోసిన రైతులను సన్మానించారు. నాయకులు మూల మల్లేశం, మాజీ ఎంపీటీసీ దిలేశ్వర్‌ రెడ్డి, ఆయిల్‌పామ్‌ కంపెనీ సీఈఓ కేషు కల్యాంకర్‌, ఉద్యాన డివిజన్‌ అధికారి మహేష్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొండా హరీష్‌, రైతులు పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్‌ రాంపల్లికి చెందిన గౌరవెల్లి రవీందర్‌రావు 4.5 ఎకరాల పొలంలో మొక్కలు నాటారు. మూడు సంవత్సరాల క్రితం ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టిన రైతులు ప్రస్తుతం మంచి దిగుబడులు, అధిక ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో సుమారు నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయవచ్చని అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభు త్వం నాలుగు సంవత్సరాలపాటు అందిస్తున్న సబ్సిడీ లను సద్వినియోగం చేసుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టాలని కోరారు. అధికారి కేషు కల్యాంకర్‌, ఉద్యాన అధికారి మహేష్‌, ఉద్యాన విస్తరణ అధికారి రాము, ఫీల్డ్‌ ఆఫీసర్‌ అరవింద్‌ పాల్గొన్నారు. డల రైతులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - Jul 11 , 2026 | 12:02 AM