ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:44 PM
సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పెద్దపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. గోదావరి బేసిన్‌లోని ఎస్సార ెస్పీ, నిజాంసాగర్, సింగూరు, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇప్పటివరకు వరద రాలేదని, వచ్చే వారం రోజులు వర్షాలు కురిసే అవ కాశాలు లేవని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నిపుణుల అం చనాల ప్రకారం జూలైలో 25 శాతం, ఆగస్టులో 9 శాతం, సెప్టెంబరులో 42 శాతం, అక్టోబరులో 55 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే వరదలపైనే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయన్నారు. సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచిం చారు. రైతువేదికలు, సహకార సంఘాల ద్వారా రైతులకు నీటి లభ్యత, వర్షపాతం అంచనాలపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వాతావర ణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు, రైతులకు సమాచారం అందించాలని సూచించారు. ఈనెల 15 తర్వాత జలాశయాల్లో నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరద పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముం దస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజె క్టుకు వరద వస్తే వెంటనే నీటిని ఎత్తిపోసేలా పంపింగ్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని, అప్పటివరకు అందుబాటులో ఉన్న నీటిని తాగు నీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో పరిస్థితి వాస్తవ మని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు. కాన్ఫరెన్స్ లో కలెక్టర్ శ్రీహర్ష, డీఏఓ శ్రీనివాస్, డీసీఓ శ్రీమాల, పాల్గొన్నారు.