బైపాస్ సర్వే పనులను అడ్డుకున్న రైతులు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:00 AM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న బైపాస్ రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ముందుగా శిలాఫలకం వేసిన మేరకు గాకుండా, మరో చోట నుంచి రోడ్డును నిర్మించాలని చూస్తుండడం వల్ల తాము భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని భావిస్తున్న రైతులు సోమవారం పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో పాటు రాజీవ్ రహదారిపై పడుకుని రాస్తారోకో చేశారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 29 (ఆంఽఽధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న బైపాస్ రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ముందుగా శిలాఫలకం వేసిన మేరకు గాకుండా, మరో చోట నుంచి రోడ్డును నిర్మించాలని చూస్తుండడం వల్ల తాము భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని భావిస్తున్న రైతులు సోమవారం పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో పాటు రాజీవ్ రహదారిపై పడుకుని రాస్తారోకో చేశారు. ఆ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని నివారించగా, సర్వే చేస్తున్న అధికా రులు వెనుతిరగడంతో రైతులు ఆందోళన విరమించారు. మండలంలోని పెద్దకల్వల నుంచి చేపడుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణానికి సోమవారం అధికారులు సర్వే చేపడుతుండగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు విలేకరులతో మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఓ చోట, పనులు చేపడుతుంది మరో చోట అన్నారు. సాగు చేసుకుంటున్న భూములకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా లాక్కోవడం సరైంది కాదని, శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉన్న భూములు సాగు చేసుకుంటేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉం దని, అలాంటిది బైపాస్ రోడ్డు నిర్మాణం కింద తమ భూములను తీసు కుంటే తమకు చావే శరణ్యమని అన్నారు. ఇప్పటికైనా సర్వేను విరమించుకోవాలని అన్నారు.