రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:41 PM
కొను గోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్ తెలిపారు. ఆదివారం కొత్తపల్లి, బుచ్చయ్యపల్లి, ఖానం పల్లి, పైడిచింతలపల్లి, రామయ్యపల్లి, గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ వైస్‌చైర్మన్ అరిగె లింగయ్యతో కలిసి ప్రారంభించారు.
ధర్మారం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కొను గోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఏఎంసీ చైర్మెన్ లావుడ్య రూప్లానాయక్ తెలిపారు. ఆదివారం కొత్తపల్లి, బుచ్చయ్యపల్లి, ఖానం పల్లి, పైడిచింతలపల్లి, రామయ్యపల్లి, గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ వైస్‌చైర్మన్ అరిగె లింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఎలాంట్ కటింగ్‌లు లేకుండానే ధాన్యం కొను గోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు లు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే విక్ర యించాలని కోరారు. డీసీసీ జిల్లా జనరల్ సెక్రెటరీ తిరుపతిరెడ్డి, డీసీసీ జిల్లా సెక్రెటరీ కొత్త నర్సింహులు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రంజిత్ కుమార్, నర్సింహులపల్లి సర్పంచ్ ఆవుల మల్లయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొడారి అంజన్న, వేల్పుల నాగరాజు తదితరలు పాల్గొన్నారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): రైతులు పం డించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తా మని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో, మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో వరి పంటను కొనుగోలు చేస్తామన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో డైరెక్టర్లు పాల్గొన్నారు.