రైతులు పంటల మార్పిడి పాటిస్తే అధిక దిగుబడి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:02 AM
ప్రతిసారి ఒకే తీరు పంటలు కాకుండా భూసారం పెంచుకునేందుకు పంటల మార్పిడి పద్ధతి పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. పొత్కపల్లిలో శనివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ఓదెల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రతిసారి ఒకే తీరు పంటలు కాకుండా భూసారం పెంచుకునేందుకు పంటల మార్పిడి పద్ధతి పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. పొత్కపల్లిలో శనివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ప్రైవేట్‌లో మక్కలు క్వింటాల్‌కు రూ.1700లు మాత్రమే ఉందని, రైతులు మోసపోకుండా మార్క్ ఫేడ్ కేంద్రంలో విక్రయిస్తే రూ.2400 ప్రభుత్వం మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. నాణ్యమైన మక్కలను మార్క్‌ఫేడ్ కేంద్రానికి తీసుకురావాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): రైతులు పంటమార్పిడి చేస్తూ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల దిగుబడి అధికంగా వస్తుందని ఎమ్మెల్యే విజయ రమణరావు అన్నారు. శనివారం వ్యవసాయ మార్కె ట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. గత ప్రభుత్వం మద్దతు ధరతో మక్కలు ఏనాడు కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్నారు. సేంద్రియ సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. రెండేళ్ల కాలంలో గుంట మడి ఎండకుండా సాగునీరు అందిం చామని గుర్తుకు చేశారు. ఈ నెల 21న ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, సర్పంచ్ రమేష్, తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ రాంమోహన్‌చారి, వ్యవసాయ అధికారి సంధ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, తదితరులు పాల్గొన్నారు.