Share News

కాంగ్రెస్‌ ప్రజాపాలనలో రైతులే రాజులు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:19 AM

కాం గ్రెస్‌ ప్రజాపాలనలో రైతులే రాజులని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మధు ర ఫంక్షన్‌ హాల్‌లో ఎలిగేడు ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం సర్వసభ్య సమావే శంలో ప్రసంగించారు.

 కాంగ్రెస్‌ ప్రజాపాలనలో రైతులే రాజులు

ఎలిగేడు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్‌ ప్రజాపాలనలో రైతులే రాజులని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మధు ర ఫంక్షన్‌ హాల్‌లో ఎలిగేడు ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం సర్వసభ్య సమావే శంలో ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలుగ కుండా పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నా మన్నారు. పంటకు మద్దతు ధర, సన్న రకాల వడ్లకు బోనస్‌, రుణమాఫీ, రైతుభరోసా కటిం గ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యాన్ని నిలువ చేసుకునేందుకు 35 వేల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణాలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో లక్షకుపై ధాన్యం నిలువ చేసేందుకు గోదాములు నిర్మిం చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎరువులను అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కొత్త యాప్‌ మూలంగా రైతు లు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనిం చాలని సూచించారు. ముల్కనూర్‌, గట్టుదుద్దెన పల్లి సొసైటిలను పాలకవర్గాలు, రైతులు పరిశీలిస్తే ఆ సొసైటీ మాదిరిగా సీడు విత్తనాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉన్నం దున రైతులు పంట మార్పిడి విధానాలపై దృష్టి సారించి రబీలో ఆరుతడి పంటలు సాగు చేసు కోవాలన్నారు. ఖరీఫ్‌లో రెండు తడులకు ఎస్‌ఆర్‌ ఎస్‌పి నీరు అందించేందుకు చర్యలు చేపడు తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఎలిగేడు పిఎసిఎస్‌ ఏ గ్రేడ్‌లో ఉండడం సంతోషకరమన్నారు.

ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ భూ దోపిడీ

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ధరణి పేరుతో భూ దోపిడీకి పాల్పడిన కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకొందని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు విమ ర్శించారు. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ధరణి వెబ్‌సైట్‌ రూపొందించుకొని వందలు, వేల ఎకరాల భూములను కొళ్లగొట్టారని ఆరో పించారు. 18 ఏళ్ళు నిండిన బాలుడి పేరున రూ.500 కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒకే కుటుంబం పేరు మీద 386 ఎకరాల భూమి ఉందని, ఇంకా బినామీ పేర్లు మీద ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ధరణి వల్ల కేసీఆర్‌ కుటుంబం బాగుపడిందని, పేదల భూములు గల్లంతై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. 22ఏలో 3.76 లక్షల ఎకరాలు ఉంటే కోటి ఎకరాల భూములు ఉన్నాయంటూ మాజీ మంత్రి హరీష్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతల భూములపై విచారణ చేస్తుంటే లెక్కకు మించిన ఆస్తులు బయట పడుతున్నాయన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాలలో భూములకు గతంలో చుక్క కాళేశ్వరం నీరు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎలిగేడు బస్టాండ్‌ కూడలి నుంచి ఆలయం వరకు ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్టార్‌ అనిల్‌ రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ సామ రాజేశ్వర్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేష్‌, ఉపాధ్యక్షుడు కోరుకంటి వెంకటేశ్వర్‌ రావు, సర్పంచ్‌లు కప్పల ప్రవీణ్‌, ఏలేటి వెంకట్‌ రెడ్డి, కవ్వంపల్లి బాపయ్య, పల్లెర్ల వెంకటేష్‌, మద్దెల రమాదేవి, మారం కొంరయ్య, రంగు లత, సిద్ది తిరుపతి, రామిడి శైలజ, దుగ్యాల వాణి, గోపు రజిత, రాధా గంగ జమున, డైరెక్టర్లు, సిఈఓలు విక్రమ్‌, రవీందర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:19 AM