కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీటి కష్టాలే..!
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:29 AM
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి అధికారాన్ని కట్టబెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కన్నీటి కష్టాలకు గురిచేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై ఎలిగేడు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఎలిగేడు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయి అధికారాన్ని కట్టబెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కన్నీటి కష్టాలకు గురిచేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై ఎలిగేడు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ కోతలు పెరిగిపోతూ పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదన్నారు. కేసీఆర్ పాలనలో పవర్ ఉత్పత్తి చేసి రాష్ట్రంలో రెప్పపాటు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించామన్నారు. 24 గంటలు కరెంట్ అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రోజుకు ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కోతలు, ప్రాజెక్టుల నుంచి సాగునీరు రాక పంటలు చేతికి అందకుండా పోతుండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారన్నారని ఆయన ఆవేదన చెందారు. సాగునీరు అందించి పంటలను కాపాడాలంటూ రైతులు ఆందోళనలు ధర్నాలు, నిరసనలు చేపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సారెస్పీ నీటిని అందించి పంటలను కాపాడాలన్నారు. రైతులకు సాగు నీరందించి పంటలు కాపాడకపోతే బీఆర్‌ఎస్ ఆందోళన కార్యక్రమాలను చేపడుతుందని హెచ్చరించారు. అంతకుముందు విద్యుత్ వేళలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితి, లో వోల్టేజ్ సమస్యలను ఏఈని అడిగి తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతిమోహన్ రావు, సుల్తాన్‌పూర్ సర్పంచ్ బాపయ్య, ఉపసర్పంచ్ రమేష్ రావు, నాయకులు బద్దం తిరుపతిరెడ్డి, పోశాలు, రాజేశం,వినోద్, సంపత్ ,నారాయణ,సాయినాథ్, సది, కార్తీక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.