Share News

గురుకుల విద్యాలయంలో వసతులు కల్పించాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:43 PM

గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ మల్క కొము రయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శిం చారు.

గురుకుల విద్యాలయంలో వసతులు కల్పించాలి

పెద్దపల్లి టౌన్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ మల్క కొము రయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శిం చారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠ్యపుస్త కాలు, భోజన నాణ్యత, తాగునీటి వసతి, గదులు, పారిశుధ్య నిర్వ హణతోపాటు ఇతర మౌలిక వసతులపై ప్రిన్సిపాల్‌, ఉపాధ్యా యులను, అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కొమురయ్య మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందిం చడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. గురుకులాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా వాతా వరణంతోపాటుగా నాణ్యమైన భోజనం, తాగునీరు, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:43 PM