Share News

కంటి ఆపరేషన్లు ప్రారంభించాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:17 PM

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని శనివారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ నిర్వహిం చారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగాలు, ఐసీయూ, లేబర్‌ రూమ్‌, జనరల్‌ వార్డులను పరిశీలించారు

కంటి ఆపరేషన్లు ప్రారంభించాలి

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని శనివారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ నిర్వహిం చారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగాలు, ఐసీయూ, లేబర్‌ రూమ్‌, జనరల్‌ వార్డులను పరిశీలించారు ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగు లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిరంతరం వైద్యులు అందు బాటులో ఉండాలని సూచించారు. ల్యాబ్‌ల్లో పరీక్షలు త్వరితగతిన ప్రారం భించేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి నిర్వహణకు సహకరించాలని ఆదేశించారు. ల్యాబ్‌ల్లో అన్నీ సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్‌ చేసి పరీక్ష ఫలితాలను ఆలస్యం లేకుండా రోగులకు అందించాలని ఆదేశించారు. కంటి ఆపరేషన్లు తక్షణమే ప్రారంభించాలని, అవసరమైన యంత్రాలు సిద్ధం చేసుకోవాల న్నారు. డెంటల్‌ విభాగంలో సగటున 40మంది మాత్రమే ఓపీకి రావడం గమనించి ఆ సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన యంత్రాలను సమీకరించుకుని డెంటల్‌ విభాగంలో సేవలను మరింత విస్తరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌ఎంఓలు కృపాభాయి, రాజు, ఆప్తమాలజిస్ట్‌ గోపికృష్ణ ఉన్నారు.

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): అంతర్గాం తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలె క్టర్‌ కోయశ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికా ర్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ తూము రవీందర్‌, సిబ్బందికి సల హాలు, సూచనలు చేశారు. రైతులకు సంబంధించిన పనులు, భూ రికార్డులను పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు.

Updated Date - Apr 25 , 2026 | 11:17 PM