గోదావరిఖని పుష్కరఘాట్‌లను పరిశీలన
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:45 PM
గోదా వరి నది పుష్కరాలు-2027 దృష్ట్యా రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి గోదావరి పుష్కర ఘాట్‌లను పరిశీలించారు.
కోల్‌సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): గోదా వరి నది పుష్కరాలు-2027 దృష్ట్యా రామగుం డం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి గోదావరి పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం గోదావరి తీర ప్రాంతాల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోలివాడ, గోదావరిఖని సమ్మక్క - సారలమ్మ పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఈ సంద ర్భంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం తీసుకుం టున్న చర్యలపై కార్యాచరణ రూపొందిం చాలని పోలీస్ అధికకారులకు సూచించారు. ఘాట్‌ల వద్ద భక్తుల రాకపోకలు, భద్రత ఏర్పాట్లు, బారీకేడ్లు, సీసీ కెమెరాలు, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను డీసీపీ పరిశీలించారు. పుష్కర ఘాట్‌ల వద్ద మహిళలు, వృద్ధులు, చిన్నారులు పుణ్య స్నానాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అత్యవసర పరిస్థితులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పుష్కర ఘాట్‌లను భక్తులు వినియోగిం చుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏసీపీ రమేష్, సీఐలు అనీల్ కుమార్, ప్రసాద్‌రావు, ఎస్‌ఐలు ఉన్నారు.