Share News

రామగుండంలో కో ఆప్షన్‌లపై ఉత్కంఠ

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:29 AM

రామగుండంలో కోఆప్షన్‌ పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొన్నది. అధికార కాంగ్రెస్‌లో ఆశావాహులు చాలా మంది ఇప్పటికే ఆశలు వదులుకుంటున్నారు. 10 నుంచి 15కో ఆప్షన్‌ పదవులు ఉంటాయని మొదట భావించినా ప్రభుత్వం కేవలం 5 పద వులకే పరిమితం చేసింది.

రామగుండంలో కో ఆప్షన్‌లపై ఉత్కంఠ

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రామగుండంలో కోఆప్షన్‌ పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొన్నది. అధికార కాంగ్రెస్‌లో ఆశావాహులు చాలా మంది ఇప్పటికే ఆశలు వదులుకుంటున్నారు. 10 నుంచి 15కో ఆప్షన్‌ పదవులు ఉంటాయని మొదట భావించినా ప్రభుత్వం కేవలం 5 పద వులకే పరిమితం చేసింది. దీనికి తోడు నిబంధనలకు సం బంధించి గతంలో కొనసాగించిన విధానాన్నే అనుసరిస్తా మని జీవో జారీ చేసింది. దీంతో ఐదు పదవుల్లో రెండు మహిళలకు కేటాయించనున్నారు. మూడు పదవులు అనుభవజ్ఞుల కోటాలో, రెండు పదవులు మైనార్టీ కోటాలో అవకాశం ఉంటుంది. అనుభవజ్ఞుల కోటాకు సంబంధించి ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా అనుభవం ఉండాలి. మూడు సంవత్సరాలు మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌(న్యాయవాది)గా పని చేసిన అనుభవం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసి రిటైర్డ్‌ అయి మున్సిపల్‌ పరిపాలనపై అనుభవం కలిగిన వారు అర్హులుగా ఉంటారు. రెండు మైనార్టీ కో ఆప్షన్‌ పదవుల్లో ముస్లిం, క్రిస్టియన్‌, బౌద్ధ, పార్సి, సిక్కు వర్గాలకు అర్హత ఉంటుంది. ఇందులో అనుభవజ్ఞుల కోటాలో ముగ్గురిలో ఒకరు, మైనార్టీ కోటాలో ముగ్గురిలో ఒకరు మహిళలకు కేటాయించనున్నారు.

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఐదు పదవులు కాంగ్రెస్‌ పార్టీకే దక్కనున్నాయి. కాగా సుమారు 100మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నిబంధనలు స్పష్టమవడంతో కొందరు ఆశలు వదులుకున్నారు. కోఆప్షన్‌ పదవుల విషయంలో మిత్రపక్షాలకు సర్దుబాటు జరుపాలని కాంగ్రెస్‌ అదిష్టానం సూచించినట్టు తెలుస్తున్నది. సీపీఎంకు ఒక కో ఆప్షన్‌ పదవి ఇస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మైనార్టీ కోటాలో ఒక ముస్లిం, ఒక క్రైస్తవ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. మూడు అనుభవజ్ఞుల కోటాలో ఒకటి ఎస్‌సీ సామాజికవర్గానికి దక్కుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోనే రామగుండంలో అత్యధికంగా డివిజన్లు ఎస్‌సీలకు కేటాయించడంతో ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని మిగతా వారు కోరుతు న్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ కోఆప్షన్‌ పదవుల విషయంలో సంకేతాలిచ్చారు. ఎవరు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని, ఎన్నికల్లో టికెట్లు పొందిన వారు ఓడిపో యిన వారికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మొత్తం గా ఒకటో రెండో మిత్రపక్షాలకు కేటాయిస్తే మైనార్టీ కోటాలో కేటాయిస్తారా అనే సందేహాలు కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షాలు కూడా తమ పార్టీలో అర్హులు లేకపోతే అనివార్యంగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - Apr 13 , 2026 | 12:29 AM