Share News

స్వచ్ఛ రామగుండానికి అందరూ కృషిచేయాలి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:44 PM

రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శనివారం 52వ డివిజన్‌ కళ్యాణ్‌నగర్‌, కాకతీయనగర్‌లో కార్పొరేటర్‌ చిదురాల నాగరాజుతో కలిసి పెద్దనాలాలోని పూడికతీత పనులను ప్రారంభించారు.

స్వచ్ఛ రామగుండానికి అందరూ కృషిచేయాలి

కోల్‌సిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రామగుండంను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శనివారం 52వ డివిజన్‌ కళ్యాణ్‌నగర్‌, కాకతీయనగర్‌లో కార్పొరేటర్‌ చిదురాల నాగరాజుతో కలిసి పెద్దనాలాలోని పూడికతీత పనులను ప్రారంభించారు. ఆయన మాటా ్లడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఏ రోగాలు దరిచేర వన్నారు. అడ్డగుంటపల్లి నుంచి 2ఏ మోరీ వరకు బాక్స్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని, ఈ బాక్స్‌ నిర్మాణ పనులకు అమృత్‌ పథకం కింద ఎమ్మెల్యే నిధులు తీసుకువచ్చారని, సాధ్యమైనంత త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొందరు తమ కాలనీల్లో రోడ్లు సరిగా లేవని మేయర్‌ దృష్టికి తీసుకురాగా రెండు నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు చెత్త బహిరంగ ప్రదేశాల్లో కానీ, కాలువల్లో పడవేయ వద్దని, రోజు ఇంటికి వచ్చే చెత్త వాహనాలకు తడి, పొడి చెత్త వేరు వేరు గా అందించాలని సూచించారు. కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ ఉన్నా పిచ్చి మొక్కలను తొలగించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు చిదురాల నాగరాజు, దాసరి సాంబమూర్తి, డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర్‌, ఈఈ పీవీ రామన్‌, డీఈ షాబాజ్‌, టీపీఓ నవీన్‌, ఏఈలు తేజస్విని, జమీల్‌, నవీన్‌, సూపరిం టెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:44 PM