ప్రతీ ఒక్కరు చట్టాలను తెలుసుకోవాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:36 PM
కోర్టుల్లో, పోలీస్‌స్టేషన్‌తో పాటు పలు శాఖల్లో ఉన్న చట్టాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం ముఖ్యమని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : కోర్టుల్లో, పోలీస్‌స్టేషన్‌తో పాటు పలు శాఖల్లో ఉన్న చట్టాల ప్రాముఖ్యత, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం ముఖ్యమని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. శుక్రవారం రాఘవపూర్ రైతువేదికలో న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితా లను నాశనం చేసుకుంటున్నారని, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాల న్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్‌లకు వాహ నాలు ఇవ్వద్దని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ చామంతిశ్రీకాంత్, రాఘవపూర్ పిహెచ్‌సి వైద్యురాలు మమత, న్యాయవాదులు బర్ల రమేష్ బాబు, వంగల రవిందర్, భాను, రాజు కార్తీక్ , నరేష్, శరత్ గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.