Share News

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:29 AM

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేం దుకు సీపీఆర్‌పై ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నా రు. వైద్య విద్యార్థులు, పోలీసు సిబ్బందితో పాటు సుమారు వెయ్యి మంది విద్యార్థులకు రామగుండంలోని సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)లో డాక్టర్‌ శివ రంజని సంతోష్‌ సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు.

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

కళ్యాణ్‌నగర్‌, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేం దుకు సీపీఆర్‌పై ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నా రు. వైద్య విద్యార్థులు, పోలీసు సిబ్బందితో పాటు సుమారు వెయ్యి మంది విద్యార్థులకు రామగుండంలోని సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (సిమ్స్‌)లో డాక్టర్‌ శివ రంజని సంతోష్‌ సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. గుడ్‌ విల్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహిం చిన సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతి థులుగా సీపీ హాజరయ్యారు. ఆయన మాట్లా డుతూ ప్రమాదాలు, గుండెపోటు వంటి అత్య వసర పరిస్థితుల్లో బాధితుడికి వైద్య సహా యం అందేలోపు సీపీఆర్‌ చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో సీపీఆర్‌ అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. సీపీఆర్‌ శిక్షణను కేవలం తమపని ప్రదేశంలోనే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిం చుకునే అవకాశం ఉంటుం దని చెప్పారు. సీపీఆర్‌ చేసే విధానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవడంతో పాటు, అవ సరమైన సమయంలో స్పం దించాలన్నారు. అనంతరం విద్యార్థులు, పోలీస్‌ సిబ్బందికి సీపీఆర్‌ ప్రాథమిక విధానా లను వివరించి డెమో నిర్వ హించారు. విద్యార్థులు, పోలీ స్‌ సిబ్బందితో కలిసి సీపీ సీపీఆర్‌ చేశారు. ఏసీపీ రమేష్‌, ప్రిన్సిపాల్‌ దయాల్‌ సింగ్‌, సూపరింటెండెంట్‌ హిమబిం దు, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ లింగమూర్తి, ఆర్‌ఐ శేఖర్‌, ఎస్‌ఐలు మనోహర్‌, రాజశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:29 AM