Share News

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:18 AM

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష నిర్వహించారు.

ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించాలి

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందాలనే ఉద్దేశ్యం తో ఉపాధ్యాయులు చేపట్టిన చర్యలతో మంచి పురోగతి సాధించామ న్నారు. భవిష్యత్‌లో ఇలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతీ వారం మండలంలో నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తనిఖీలను చేపట్టాలన్నారు. చెక్‌ లిస్ట్‌ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించి పర్యటన సంబంధించిన రిపోర్టును తయారు చేయాలని తెలిపారు. విద్యార్థులు సహజ సిద్ధంగా విషయ పరిజ్ఞానం పొందేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే 6 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు బేసిక్స్‌ దృఢంగా ఉం డాలని, రోజు గంట సమయం స్పెషల్‌ క్లాసు ఏర్పాటు చేయాలన్నారు. 8, 9వ తరగతి విద్యార్థులపై సైతం శ్రద్ధవహిస్తూ వారికి విషయ పరిజ్ఞానం అందేలా చూడాలన్నారు. పాఠశాలల కంప్యూటర్లను విని యోగించి, ఉన్నత తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో పాత సామాన్లు, స్టోరే జ్‌ వస్తువులను తొలగించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారులు షేక్‌, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, అధికారులు తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:18 AM