Share News

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:05 AM

ఎన్టీపీసీ లో పటిష్టమైన భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని రామగుం డం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ ఎలక్ర్టికల్‌ సేఫ్టీ వారోత్సవాలను శుక్రవా రం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో ప్రారం భించారు.

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

జ్యోతినగర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ లో పటిష్టమైన భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని రామగుం డం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ ఎలక్ర్టికల్‌ సేఫ్టీ వారోత్సవాలను శుక్రవా రం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పత్తితోపాటు భద్రత విషయంలో యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుందన్నారు. ఏ పరిశ్రమకైనా భద్రత వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ఆ సంస్థ అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రతీ ఉద్యోగి, కార్మికుడు పని స్థలాల్లో సేఫ్టీ నియమాలను పాటించాలని కోరారు. ప్రతీ ఉద్యోగి హెల్మెట్‌ ధరించాలని, షూ వేసుకోవాలన్నారు. ప్రాజెక్టులోని కార్మికుల భద్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఎలక్ర్టికల్‌ వీక్‌లో కార్మికులు పాల్గొనాలని ఈడీ కోరారు. ఈడీ చందన్‌ కుమార్‌, ఉద్యోగులు, అధికారులతో సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. జీఎంలు ముకుల్‌ రాయ్‌, అవిజిత్‌ దత్త, విజయ్‌ జోష్‌, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:05 AM