Share News

నేరాల నియంత్రణకు ప్రతీ పౌరుడు ముందుకు రావాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:00 AM

మహిళల భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

నేరాల నియంత్రణకు ప్రతీ పౌరుడు ముందుకు రావాలి

జ్యోతినగర్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల భద్రత, మైనర్‌ బాలికల రక్షణ మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మత్తుకు బానిసైన వారికి డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించాలని తెలి పారు. మహిళల భద్రత, మైనర్‌ బాలికల రక్షణ, సైబర్‌ నేరాల నివా రణ, ట్రాపిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రత, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం ఏసీపీ రమేష్‌ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల తక్కువ సమయంలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, బలహీన నిర్మాణాలు ప్రమాదాలకు కారణం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. సోషల్‌ మీడియా, మత్తుపదార్థాలు, సైబర్‌ నేరాలపై యువత అప్రమ త్తంగా ఉండాలన్నారు. బాలికలు మోసపూరిత సంబంధాల బారిన పడి ఇళ్ల నుంచి వెళ్లి పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని, ఇలాంటి సంఘ టనలు అరికట్టేందుకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతిని ధులు, మహిళా సంఘాలు సమిష్టిగా పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి సమాజంలో మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని ఏసీపీ పిలుపునిచ్చారు. మున్సి పల్‌ కమిషనర్‌, డిప్యూటీ మేయర్‌లు పాల్గొనగా, రామగుండం సీఐ కృష్ణ కుమార్‌, గోదావరిఖని వన్‌ టౌన్‌ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ఆప్ఝాలుద్దీన్‌, ఎన్టీపీసీ ఎస్‌ఐలు ఉదయ్‌ కిరణ్‌, లచ్చయ్య, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 12:00 AM