పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:43 PM
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోదావరి ఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆమె మొక్కలు నాటారు.
కోల్‌సిటీటౌన్, జూన్5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధానన్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోదావరి ఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆమె మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకం లేకపోవడంతో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. ఉష్ణోగ్రత పెరిగి వాతావ రణ సమతుల్యత లోపించిందన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్‌రెడ్డి, 1, 2వ అదనపు మున్సిఫ్ మేజిస్ర్టేట్‌లు స్వారిక, శ్రీనిజ, కోహిల్కర్‌తో పాటు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ, బార్ అసోసియేషన్ ప్రతినిధులు గుజ్జెటి సత్యనారాయణ, కుడిది వెంకటేష్, గజ్జెల ప్రసన్న, జువ్వాజి, శ్రీనివాస్, చిదురాల రమేష్, షాహన్‌వాజ్‌ఖాన్ పాల్గొన్నారు.