అర్హులైన ప్రతీ ఓటరు పేరు ఉండేలా చూడాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:24 AM
ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి పట్టణం లోని రెండో వార్డు శాంతినగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓలు చేపడుతున్న ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ లను కలెక్టర్ పరిశీలించారు.
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి పట్టణం లోని రెండో వార్డు శాంతినగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓలు చేపడుతున్న ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ లను కలెక్టర్ పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, పేరు, చిరునామా, వయ స్సు, కుటుంబ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. ఒకే వ్యక్తికి బహుళ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే నిబంధనల ప్రకారం నిర్ధారించాలని ఆదేశించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలించాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరిం చాలని ఆదేశించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, బీఎల్‌వోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈవో సుదర్శన్‌రెడ్డి
పెద్దపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు అందించి, పకడ్బందీగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నోటీసుల జారీ, పంపిణీ, విచారణ ప్రక్రియను సమీక్షించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణకు పూర్తి అవకాశం కల్పించాలని, వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. ప్రతీ కేసు వివరాలను సక్రమంగా నమోదు చేస్తూ, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు శ్రీరాములు, అరుణశ్రీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 19 వేల నో మ్యాపింగ్, 1.22 లక్షల అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే నోటీసులు జనరేట్ చేసి పంపిణీ ప్రక్రియ చేపట్టామని, విచారణ కొనసాగుతోందని వివరించారు. అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సీఈఓ సూచించారు. సమావేశంలో ఆర్డీవో గంగయ్య, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.