Share News

గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపు

ABN , Publish Date - May 01 , 2026 | 11:59 PM

గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మంథనిలో మంత్రి శ్రీధర్‌ బాబు విస్త్రతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపు

మంథని, మే 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మంథనిలో మంత్రి శ్రీధర్‌ బాబు విస్త్రతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌ గ్లర్స్‌ హైస్కూల్‌ విద్యార్థు లకు ఇస్తున్న సూపర్‌ సమ్మర్‌ క్యాంపును సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్‌, ఏఐ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇప్పి స్తున్నామన్నారు. మంథనిలో 70 మంది విద్యార్థులు, జిల్లాలో 351 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్నారు. మంథని పట్టణాభి వృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుం టుందన్నారు. గోదావరి నదిని సందర్శించిన మంత్రి నదిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కొత్త మున్సిపల్‌ కార్యాలయాన్ని పరిశీలించిన మార్పులు సూచించారు. ప్రతి గది స్పష్టంగా కనిపించేలా ఉండాలని, గాలి, వెలుతురు వచ్చే విధంగా నిర్మాణం చేయాలని తెలిపారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంఆర్వో, ఆర్డీవో, సమగ్ర మండల కార్యాల యాల సముదాయాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. పాత ఎంపీడీవో భవనాన్ని ఐటీ శాఖకు కేటాయించి పునరుద్దరణ చేయాలన్నారు. అయ్యగారి చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. టాస్క్‌ సెంటర్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. ఆర్డీవో సురేష్‌, ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషణ్‌కాచే, మున్సిపల్‌ చైర్మన్‌వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ముస్కుల సహేందర్‌రెడ్డి, కమీషనర్‌ మనోహర్‌, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్నలు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 11:59 PM