విద్యతోనే బాలికల సాధికారత సాధ్యం
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:45 PM
విద్య తోనే బాలికా సాధికారత సాధ్యమని ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సామంత అన్నారు. శుక్రవారం పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరి యంలో జరిగిన బాలిక సాధికారత మిషణ్ శిక్షణలో ప్రసంగించారు.
జ్యోతినగర్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): విద్య తోనే బాలికా సాధికారత సాధ్యమని ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సామంత అన్నారు. శుక్రవారం పీటీఎస్‌లోని కాకతీయ ఆడిటోరి యంలో జరిగిన బాలిక సాధికారత మిషణ్ శిక్షణలో ప్రసంగించారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి నులలో ఆత్మవిశ్వాసం నింపేందుకు, వారిని చదువులో ప్రోత్సహించేందుకు జెమ్ కార్యక్ర మాన్ని యేటా నిర్వహిస్తున్నామన్నారు. నెల రోజులపాటు 140మంది విద్యార్థులకు చదువు తోపాటు పలు అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపారు. వారు భవిష్యత్‌లో ఎంచుకున్న రంగంలో రాణించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఇక్క డ నేర్చుకున్న అంశాలను భవిష్యత్‌లో పునఃశ్చరణ చేసుకొని రాణించాలని తెలిపారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ పథకం ద్వారా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తుం దని ఈడీ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పన తదితర రంగాలకు సీఎస్‌ఆర్ నిధు లను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. తాము అందిస్తున్న చేయూతలను సద్వినియోగం చేసుకోవాలని ఈడీ చందన్ కుమార్ కోరారు. జెమ్ ముగింపు సందర్భంగా 30 రోజులపాటు శిక్షణ పొందిన విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వ హించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినుల శాస్ర్తీయ, జాన పద పాటలపై నృత్యాలు చేశారు. శిక్షణలో నేర్చుకున్న యోగా ప్రదర్శన చేశారు. విద్యార్థు లకు ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సర్టిఫికె ట్లను అందించారు. ఎన్టీపీసీకి చెందిన వివిధ విభాగాల జీఎంలు, ఏజీఎం హెచ్‌ఆర్ సాగర్ రంజాన్ సాహూ, సీఎస్‌ఆర్ అధికారులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.