Share News

రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:26 AM

జిల్లాలో మత్స్యరంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలా శయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్‌ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు.

 రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

పెద్దపల్లి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్స్యరంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలా శయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్‌ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు. ఎల్లంపల్లి జలాశయంలో మొత్తం 120 ఫిష్‌ కేజీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఒక్కో కేజీ పొడవు 7.5 మీటర్లు, లోతు 4 మీటర్లుగా ఉంటుందని, 12 కేజీలతో ఒక బ్యాటరీ, మొత్తం 10 బ్యాటరీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేజీల్లో బ్లాక్‌ కెలాథియా చేపల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్యాటరీ ఏర్పా టుకు వాకింగ్‌ ట్రాక్‌తో కలిపి సుమారు రూ.28 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. 6 నుంచి 7 నెలల్లో చేపలు 700 గ్రాముల బరువుకు పెరుగుతాయని, ఒక్కో కేజీలో 2,500 చేప పిల్లలను వదిలితే 80 శాతం జీవన శాతంతో సుమారు 2 వేల చేపలు పెరుగుతాయని చెప్పారు. ఒక్కో కేజీ కల్చర్‌ ద్వారా సుమారు రూ. 30 వేల లాభం వచ్చే అవకాశం ఉందన్నారు. ఫిష్‌ కేజీ కల్చర్‌ల నిర్వహణలో మండల స్థాయి మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్‌ సూచించారు. లబ్ధిదారుల్లో యాజమాన్య భావన పెంపొందేందుకు కనీసం 10 శాతం పెట్టుబడి వారివద్ద నుంచే ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆసక్తి కలిగిన రైతులను గుర్తించి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో చేపల చెరువుల ఏర్పాటు కోసం సుమారు రూ.35 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని తెలిపారు. ఒక్కో కల్చర్‌కు 7 నుంచి 8 నెలల్లో సుమారు రూ. 54 లక్షల లాభం వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు ఈ వివరాలు తెలియజేసి ముందుకు వచ్చే వారికి సహకారం అందించాలని అధికారులను ఆదే శించారు. ఫార్మసీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణ, ఉపాధి అవకా శాలు, ఆర్థిక సహకారం అంశాలపై అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. టెలీపెర్ఫా ర్మెన్స్‌ ఫాక్స్‌కాన్‌ సంస్థలు 500 మంది యువతకు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నందున, ఐడీ ఓసీలో నిర్వహించనున్న జాబ్‌ మేళాను సమర్థవం తంగా నిర్వహించి ఎక్కువ మంది యువతకు ఉద్యో గావకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉపాధి అవకాశాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. సింగరేణి జనరల్‌ మేనేజర్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి పి నరేష్‌ కుమార్‌ నాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కీర్తికాంత్‌, జిల్లా ఉపాధి కలఁనాధికారి ఎం రాజశేఖర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌, టాస్క్‌ ఇన్‌చార్జ్‌ కౌసల్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:26 AM