Share News

రోజూ 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:14 PM

జిల్లాలో వీబీజీ రామ్‌ జీ పథకం అమలు తీరుపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీబీజీ రామ్‌జీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

రోజూ 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలి

పెద్దపల్లి, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీబీజీ రామ్‌ జీ పథకం అమలు తీరుపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీబీజీ రామ్‌జీ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పథకం కింద ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్లు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పిట్ల నిర్మాణ పనులను ప్రారంభించి నవంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, నీటి లీకేజీలను అరికట్టి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈఓ నరేందర్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 11:14 PM