Share News

మహాధర్నాకు ఉద్యోగులు తరలిరావాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:48 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో సోమవారం నిర్వహించిన ఉద్యమ సన్నాహాక సమావేశంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్‌, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

మహాధర్నాకు ఉద్యోగులు తరలిరావాలి

జ్యోతినగర్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో సోమవారం నిర్వహించిన ఉద్యమ సన్నాహాక సమావేశంలో ఉద్యోగ, ఉపా ధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్‌, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల విడుదల, సీపీఎస్‌ రద్దు, ఓపీసీ అమలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు ఉద్యోగుల హక్కులని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాకు డివిజన్‌ నుంచి వేలాది మందిగా తరలిరావాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అయి రెడ్డి సందీప్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు సందీప్‌ రావు, జిల్లా సంఘ బాధ్యులు ఎదుల ప్రవీణ్‌, అంజి, చొప్పరి శ్రీనివాస్‌, శివ, రాజారత్నం, అంకమల్ల అనిల్‌, రామగుండం యూనిట్‌ అధ్యక్షుడు జగ న్‌, కార్యదర్శి సరిత, ఇంజనీర్ల సం ఘం కార్యదర్శి రవీంద్రచారి, నరేష్‌, శ్రీకాంత్‌, లావణ్య, ఝాన్సీరాణి, టీజీఓ సంఘం నాయకులు వెంకటలక్ష్మి, టీఎన్జీవో నాయ కులు శ్రీవాణి, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:48 PM