ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:07 AM
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల డిమాండ్లను పభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల డిమాండ్లను పభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వారి పాత్ర ఎంతో కీల కమన్నారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఉద్యో గుల సమస్యలను అధికారులు, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, బిఆర్ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్, పూదరి చంద్రశేఖర్, బాలసాని శ్రీనివాస్, అడ్వకేట్ శ్యాంబాబు, గడ్డం శ్యామ్, శ్రీనివాస్ జక్కుల శ్రీకాంత్ ఉన్నారు.