ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:49 PM
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గురువారం నిర్వహించిన మహాధర్నాలో ఆయ న మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 27 (ఆంఽధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గురువారం నిర్వహించిన మహాధర్నాలో ఆయ న మాట్లాడారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్‌కార్డుల అమలు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తులు, జీఓ25 సవరణ, జీఓ190 అమలు చేయాలని కోరారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యతే ఉద్యమానికి బలమన్నారు. జానపద కళాకారుల ఉద్యమ గీతాలు, నృత్యా లతో ప్రాంగణం మార్మో గింది. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సందీప్‌రావు, గోపు అనిత, కొమురయ్య, శ్రీనివాస్, మహేం దర్‌రెడ్డి, స్వప్నకుమారి, ప్రవీణ్, శ్రీధర్, రమేష్, రాజారత్నం, సౌమ్య, అంజయ్య, నిశాంత్‌రావు, శిల్ప, స్వప్న, శివ, గండు సురేష్, రవీంద్రనాథ్, తదితరులున్నారు.