Share News

విద్యుత్‌, సాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:06 AM

రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు, సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని బీజేపీ నాయకులు, రైతులు శనివారం రాఘవపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్‌, సాగునీటి సమస్య పరిష్కరించాలి

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు, సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని బీజేపీ నాయకులు, రైతులు శనివారం రాఘవపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తరచూ విద్యుత్‌ కోతలు విధించడంతో వ్యవసాయ మోటార్ల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు గొట్టి ముక్కుల సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో తూకం పేరుతో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్‌, యువ మోర్చా అధ్యక్షులు రామగిరి అఖిల్‌, కందుల శ్రీనివాస్‌, కల్లేపల్లి అంజి, వేణు, కుమార్‌,అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:06 AM