ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:30 AM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దకల్వలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పోరుబాట పిలుపు మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దకల్వలలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పోరుబాట పిలుపు మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దకల్వలలో మాజీ ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం బాకీ కార్డులను ఇంటింటా అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక నెరవేర్చ లేద న్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక అభివృద్ధి కుం టుపడిందని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడంతోపాటు, గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ నర్ల కనుకమ్మపోల్‌రాజు, సలేంద్ర రాములు, పర్స శంకరయ్య, శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. తుర్కలమద్దికుంటలో మాజీ వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, నాయకులు చాంద్‌పాష, నరేష్, రాంచంద్రా రెడ్డి, స్వామి, ఐలయ్య, శంకర్, లక్ష్మయ్యలతో పాటు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.