Share News

రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కృషి

ABN , Publish Date - May 07 , 2026 | 11:50 PM

రైతులకు ఆర్థిక భారం తగ్గించ డంలో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. కాట్నపల్లిలో రైతులకు, విద్యుత్‌ వినియోగదారులకు, సంస్థలకు సోలార్‌ సిస్టమ్‌తోపాటు విద్యుత్‌ శాఖ ద్వారా అందుతున్న సేవల గురించి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కృషి

సుల్తానాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఆర్థిక భారం తగ్గించ డంలో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. కాట్నపల్లిలో రైతులకు, విద్యుత్‌ వినియోగదారులకు, సంస్థలకు సోలార్‌ సిస్టమ్‌తోపాటు విద్యుత్‌ శాఖ ద్వారా అందుతున్న సేవల గురించి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఈ మాట్లాడుతు గృహజ్యోతి, పొలంబాట, ప్రజాబాట, విద్యుత్‌ భద్రత కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెల్లి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. రైతులు చెల్లించే ఇరవై వేల నుంచి అరవై వేల వరకు ఉన్న ఓఆర్‌సీ చార్జీలను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రైతులు వ్యవ సాయ కనెక్షన్‌కు కిలోవాట్‌కు వేయి రూపాయల రుసుం చెల్లిస్తే సరిపో తుందన్నారు. వ్యవసాయ భూముల్లో సోలార్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసు కుని మిగిలిన విద్యుత్‌ను డిస్కింకు విక్రయించుకుని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. అందుబాటులో ఉన్న రాయితీలతో కూడిన సోలార్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 1 నుంచి ఏడు వరకు సర్కిల్‌ పరిధిలో అన్ని ప్రాంతాలలో విద్యుత్‌ వారోత్సవాలను నిర్వహించామన్నారు. ప్రజాప్రతినిదులతోపాటు డీఈ రాజబ్రహ్మచారి, ఏడీఈ కుమారస్వామి, ఏఈ సైఫోద్దిన్‌, కుమారస్వామి పాల్గొన్నారు

Updated Date - May 07 , 2026 | 11:50 PM