Share News

సదాశయ ఫౌండేషన్‌కు ప్రభుత్వ గుర్తింపునకు కృషి

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:11 AM

అంధత్వ నివా రణ, అవయవదానం, శరీర దానాలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న సదాశయ ఫౌండేషన్‌కు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆది వారం నిర్వహించిన ఫౌండేషన్‌ వార్షికోత్సవానికి హాజర య్యారు.

సదాశయ ఫౌండేషన్‌కు ప్రభుత్వ గుర్తింపునకు కృషి

ఓదెల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): అంధత్వ నివా రణ, అవయవదానం, శరీర దానాలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న సదాశయ ఫౌండేషన్‌కు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆది వారం నిర్వహించిన ఫౌండేషన్‌ వార్షికోత్సవానికి హాజర య్యారు. ఈ సందర్భంగా 290 మంది నేత్ర, అవయవ, శరీరదాతలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆప్తులను కోల్పోయి దుఃఖం లోనూ వారి నేత్రాలను దానం చేసి అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు రావడం అభినం దనీయమని పేర్కొన్నారు. నేత్ర,శరీర అవయవదా నాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సదాశయ ఫౌం డేషన్‌ చేస్తున్న సేవలను ప్రశంసించారు. అవయవ దానాల్లో రాష్ట్రంలోనే ఓదెల మండలం ముందం జలో ఉండటం ఆదర్శమని నిర్వాహకులను అభి నందించారు. డీఎంహెచ్‌వో పవిత్ర మాట్లాడు తూ వెలకట్టలేని నేత్రాలు, అవయవాలు కొను గోలు చేస్తే దొరకవని, ఇందుకు దానం చేసేం దుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరా రు. సదాశయ ఫౌండేషన్‌ ఆవిర్భావ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ మాట్లాడారు. సర్పం చ్‌ కనికిరెడ్డి సతీష్‌, వైద్యాధికారి సహబాజ్‌ఖాన్‌, ఫౌండేషన్‌ జాతీ య కార్యదర్శి మెర్గు భీష్మచారి, లింగమూర్తి, అల్లం సతీష్‌, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, రంగయ్య , వాసన్‌ ఐకేర్‌ బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ అర వింద్‌, కుమార్‌, సాన రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:11 AM