కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:38 PM
రాష్ట్రంలో కార్మికులం దరికి న్యాయం జరిగేలా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్‌లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూని యన్ (టీహెచ్‌డబ్ల్యూయూ) దశాబ్ది ఆవిర్భావ వేడుకలో మంత్రి పాల్గొ న్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కార్మికులం దరికి న్యాయం జరిగేలా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్‌లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూని యన్ (టీహెచ్‌డబ్ల్యూయూ) దశాబ్ది ఆవిర్భావ వేడుకలో మంత్రి పాల్గొ న్నారు. కార్యక్రమానికి మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ కోదండరాంలు హజరయ్యారు. మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు కాకా కుటుంబంపై ప్రత్యేక అభిమానం చూపిస్తారని, కార్మికుల కోసం కాకా పెన్షన్ సౌకర్యం కల్పించారన్నారు. గత ఏడాది రాష్ట్రంలో ధాన్యం అధికంగా పండిందని, వాటిని లోడ్ చేయడం, గోదాంలకు చేర్చ డంలో హమాలీల పాత్ర కీలకమైందన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే శుభవార్త చెపుతానన్నారు. కార్మికులకు 33 జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఐటిఐల ద్వారా నూతన కోర్సులను సీఎం తీసుకొచ్చారని, వాటి ద్వారా శిక్షణ పొందిన వారికి జర్మనీలో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉన్న రైతులు సాగునీరు, విద్యుత్‌ను వృథా చేయొద్దన్నారు. ప్రభుత్వం సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వం విమర్శలు తప్ప వారికేమి పనిలేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని పేర్కోన్నారు.
కార్మికులు అంటేనే కాకా వెంకటస్వామి గుర్తుకు వస్తారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కార్మికుల సమస్యలు తరచూ చూసిన వ్యక్తి కాకా అని, కార్మికులకు న్యాయం చేసేందుకు పెన్షన్ పఽథకాన్ని తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కొత్త లేబర్ కోడ్‌లపై చర్చిస్తామని, కార్మికుల హక్కులు, సంక్షేమానికి నిరంతరం పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కార్మికులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. హమాలీ కార్మికులకు, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎఫ్‌సీఐ, రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పార్లమెంట్‌లో బలంగా వినిపిస్తాన న్నారు. హమాలీ కార్మికులకు సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్య సదుపాయాలు, మెరుగైనా వసతులు అవసరం ఉందన్నారు.
హమాలి కార్మికులకు భూమి ఉండి ఇళ్లు లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలవాలంటే ఇబ్బందిక రంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు చెప్పుకునేందుకు సులువైందన్నారు. ఆరు నెలల్లో కార్మిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం సర్ అనే పేరుతో ఉన్న ఓట్లను తీసేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దేశంలో అందరూ సమానులే అని అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారని, దానిని కేంద్ర ప్రభుత్వం ధిక్కరిస్తుందన్నారు. పేదోడి ఓటు హక్కు తొలగించేందుకు కుట్రలు పన్నుతుందని, సర్‌ను పూర్తిగా తొలగించేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు. సంఘాలు అంటే ఆదాయం కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయని, కాని హమాలీ కార్మిక సంఘం ఉపాధి కోసమేనన్నారు. కార్మికుల సమస్యలతో పాటు ఓటు హక్కు కోసం పోరాటం చేయాలన్నారు. రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు కనగంటి రవి, న్యాయసలహాదారులు ఉప్పురాజు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు జంగ సంపత్, కామ భూమ య్య, రాష్ట్ర కార్యదర్శి కొమ్ము మధు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల నరేష్, కౌన్సిలర్లు అస్లాం, కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, బండారి సునిల్ గౌడ్, ఉనుకొండ శ్రీధర్ పాల్గొన్నారు.