Share News

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

ABN , Publish Date - May 28 , 2026 | 11:50 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్‌టీపీసీ డిప్యూటీడీజీఎం (హెచ్‌ఆర్‌) ప్రవీణ్‌ చౌదరి, ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ ఎం నాగభూషణం పిలుపుని చ్చారు. గురువారం ఆర్‌టీసీ, ఎన్‌టీపీసీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్‌ ఆవరణలో మొక్కలను నాటారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

కళ్యాణ్‌నగర్‌, మే 28(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్‌టీపీసీ డిప్యూటీడీజీఎం (హెచ్‌ఆర్‌) ప్రవీణ్‌ చౌదరి, ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ ఎం నాగభూషణం పిలుపుని చ్చారు. గురువారం ఆర్‌టీసీ, ఎన్‌టీపీసీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్‌ ఆవరణలో మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ పర్యావరణ అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉం చడం, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని, ప్రజల్లో పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, చెత్తను బాధ్యతయుతంగా ఎత్తివేయాలని సూచించారు. ఎన్‌టీపీసీ సివిల్‌ మేనేజర్‌ ఆశీష్‌, స్నేహ లత, ఆర్‌టీసీ అధికారులు సంధ్యారాణి, లింగయ్య, శంకర్‌, సదానందం, ఏఆర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:50 PM