నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:27 PM
నేరస్థులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలక మని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమి షనరేట్‌లో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
కోల్‌సిటీ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): నేరస్థులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలక మని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమి షనరేట్‌లో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబం ధిత నేరాలు, శారీరక దాడులు, తదితర కేసుల్లో నింది తులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టి న్యాయస్థానంలో సమర్థవంతంగా కేసులను వాదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లైజ నింగ్, కోర్టు డ్యూటీ అధికారులు పరస్పరం సమన్వ యంతో పని చేయాలని, నేరస్థులకు శిక్ష పడడం ద్వారా బాధితుల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుం దన్నారు. ఎన్‌బీడబ్ల్యూ సమన్లు తప్పనిసరిగా అమలు చేయాలని, కేసులు విచారణలో ఉన్నప్పుడు కేవలం కోర్టుకు హాజరు కావడమే కాకుండా నిందితులకు శిక్షలు పడేలా చూడాలని, నిందితుల ఆస్తులను జప్తు చేయడం వంటి వేగంగా చేయాలన్నారు. దోషు లకు శిక్షలు పడితే బాధితుల కు పోలీస్ వ్యవ స్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని, కాంటెస్టెడ్ కేసుల్లో నిందితులు బాధితులను బెదిరించడం, ఇతర ఇబ్బందులకు గురిచేస్తే కోర్టు డ్యూటీ అధికారులు బాధితులతో నిరంత రం సంప్రదించాలని సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడడంలో కీలకపాత్ర పోషించి కోర్టు డ్యూటీ సిబ్బంది, లైజనింగ్ అధికారు లను సీపీ సన్మానించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, వర్టికల్ ఇన్‌చార్జి చంద్రశేఖర్, సీసీఆర్‌బీ ఇన్ స్పెక్టర్ అనీల్‌కుమార్, బాబు, ఎస్‌ఐవినీత పాల్గొన్నారు.