కళాకారుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:05 AM
జిల్లాలోని అన్ని రంగాల కళాకారులకు ఒక బలమైన ఐక్యవేదికగా కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని స్నేహసాహితీ గ్రంథాలయంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు.
కోల్‌సిటీటౌన్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని రంగాల కళాకారులకు ఒక బలమైన ఐక్యవేదికగా కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని స్నేహసాహితీ గ్రంథాలయంలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. కళాకారులు అశోక్ వేముల, గణేష్, కొమ్మ కుమార్‌యాదవ్, దామెర శంకర్, మూల శంకర్ మాట్లాడారు. భవిష్య త్‌లో కళాకారుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ కళా కారుడు జల్లారం సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ జనగామ తిరుపతి, కళాకారులు శ్రీనివాస్, గంగా భవాని, జక్కిని శ్రీలత, మేకల శ్రీకాంత్, రేయ్ వేణుగోపాల్, అచ్చ సత్యవతి, రాజేష్, గొట్టె మహేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.