ఆలయ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 14 , 2026 | 12:06 AM
ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం డీఎంఎఫ్‌టి నుంచి రూ.కోటి వ్యయంతో ఆలయ నుంచి కొమిర వరకు నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఓదెల, మే 13 (ఆంధ్రజ్యోతి) : ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం డీఎంఎఫ్‌టి నుంచి రూ.కోటి వ్యయంతో ఆలయ నుంచి కొమిర వరకు నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 45 రోజుల్లో సీసీ రోడ్లతోపాటు భక్తులకు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు అబ్బిడిపల్లి వరకు రోడ్డు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. ఒగ్గు పూజారులకు టికెట్ల ధరలను పెంచి ఇబ్బందులు లేకుండ ఆదుకున్నట్లు తెలిపారు. అనంతరం కనగర్తిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు జాగిర్ కిషోర్ గృహప్రవేశానికి హాజరయ్యారు. గుండ్లపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, ఆలయ ఈవో సదయ్య, పిట్టల రవీందర్, సర్పంచులు కనికిరెడ్డి సతీష్, చొప్పరి సంధ్యారాణి, కుమార్, పుప్యాల స్వప్న, శంకర్, నాయకులు అంబాల కొమురయ్య, రెడ్డి రజనీకాంత్, ఆకుల మహేందర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.