విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:12 AM
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో యాజమా న్యాల ఒత్తిడి వల్ల పలువురు నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవు తున్నారని అన్నారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం నాలుగు వేలకు కుదించే ఆలోచన విరమించుకోవాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవకాశాలు కల్పించాలన్నారు. పలు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, నాయకులు తాండ్ర గౌతమ్, తాళ్లపల్లి రాజు, రాజ్ కుమార్, నరేష్, అభిలాష్, రాహుల్, వినయ్, నితిన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.