10న విద్యా సంస్థల బంద్
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:47 PM
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఆది వారం సుల్తానాబాద్ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ సమావేశం జరిగింది. ప్రశాంత్ మాట్లాడుతు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్పటి నుంచి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక శిథి లావస్థలో ఉన్న స్కూల్స్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు సకా లంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు తాండ్ర గౌతమ్ సాహు, రాజు, అరవింద్,నిఖిల్,అజయ్, ఆరుణ్, అఖిల్, రేహాన్, ప్రణయ్,శశాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.