Share News

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:00 AM

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది.

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

పెద్దపల్లి కల్చరల్‌, జూలై10(ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శిం చారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలో మౌలిక వసతులు లేక శిథిలావస్థలో కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పక్కా భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు వస తులు కల్పించి, వారికి రెండు జతల దుస్తులతోపాటు సామగ్రి అందిం చాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు పెంచి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలని, విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ కింద ఉన్న రూ.250 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్‌, జిల్లా సహాయ కార్యదర్శి మామిడిపల్లి అరవింద్‌, నాయకులు నరేష్‌, రాజ్‌ కుమార్‌, సంజీవ్‌, అభినవ్‌, ప్రవీణ్‌, ప్రమోద్‌, నాగరాజు, రాకేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:00 AM