విద్యతోనే సమాజంలో రుగ్మతలు రూపుమాపవచ్చు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:35 PM
విద్య ద్వారానే సమాజంలో రుగ్మతలు మార్చవచ్చని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. మంగళవారం సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాకా గ్రోత్ ఫండ్ నుంచి స్కూల్ బ్యాగులను 200 మందికి అందించి మాట్లాడారు. కాకా వెంకటస్వామి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని కొనియాడారు.
ఎలిగేడు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్య ద్వారానే సమాజంలో రుగ్మతలు మార్చవచ్చని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. మంగళవారం సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాకా గ్రోత్ ఫండ్ నుంచి స్కూల్ బ్యాగులను 200 మందికి అందించి మాట్లాడారు. కాకా వెంకటస్వామి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని కొనియాడారు. ప్రతి విద్యార్ధి కృషి పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి విద్యార్థుల సంఖ్యను పెంచుతు విద్యాభివృద్ధికి దోహద పడాలన్నారు. పదో తరగతి విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాన్ని పెంచుకొని ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో గదుల కొరత ఉందని, 6 అదనపు గదులు, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అల్పాహారం మండలం లోని అన్ని పాఠశాల విద్యార్థులకు అందించేలా కృషి చేయలన్నారు. పాఠశాల ముందు నుంచి ప్రధాన రహదారి వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు వెచ్చించాలని సర్పంచ్ బాపయ్య కోరారు. అనంతరం ఎలిగేడులో రూ.5 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. సర్పంచ్ కవ్వం పల్లి బాపయ్య, ఉప సర్పంచ్ తానిపర్తి రమేష్ రావు, మాజీ సర్పంచ్ లచ్చయ్య, గోల్లే భూమేష్, మాజీ ఎంపిపి కళ్లెం లక్ష్మన్, మండల విద్యాధికారి అనసూరి నరేంద్ర చారీ, యూపిఎస్ హెచ్‌ఎం సంతోష్ రెడ్డి, నాయకులు అడ్డగుంట శ్రీనివాస్, సెగ్యమ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.