నేడు ఖనిలో దసరా ఉత్సవాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:59 PM
గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోల్‌సిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ ఆర్టిస్ట్ శివారెడ్డి ఆధ్వర్యంలో సినీ కళాకా రులు, జబర్దస్త్ టీమ్‌తో పాటు గాయని, గాయకులు హాజ రుకానున్నారు. ఫైర్ షో, రావణవధ కార్యక్రమాన్ని నిర్వ హించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకాను న్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు, కార్మిక కుటుంబాలు తరలిరావాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఎంపీని ఆహ్వానించకపోవడం బాధాకరం
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించ నున్న దసరా ఉత్సవాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష ్ణను పిలవకపోవడం, ఆహ్వాన పత్రికల్లో పేరు పెట్టకపో వడం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పీ మల్లికార్జున్ అన్నారు. ఆదివా రం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జాగృతి కల్చరర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే మాలెం మల్లేషం దసరా ఉత్సవాలను ప్రారంభిం చారని, 2004లో బడికెల రాజలింగం మున్సిపల్ చైర్మన్ అయిన తరువాత మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా రని, తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ దసరా ఉత్స వాలను నిర్వహించారన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చడంలో నిర్లక్ష్యం వహించలేదని, ఈసారి ఉత్సవాలకు ఎంపీని ఆహ్వానించకపోవడం ఆక్షేపనీయమన్నారు. కాం గ్రెస్ నాయకుడు కామ విజయ్, శ్యామ్, మహేష్, రెడ్డి, దినేష్ పాల్గొన్నారు.