Share News

సూపర్‌ ఎల్‌నినోతో కరువు

ABN , Publish Date - Nov 03 , 2026 | 11:28 PM

యాసంగి సీజన్‌లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం చూపబోతోందని, కరువు రానుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాల, బోజన్నపేట, హన్మంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, చీకు రాయి, పెద్దపల్లివ్యవసాయ మార్కెట్‌, చందపల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

సూపర్‌ ఎల్‌నినోతో  కరువు

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 3 (ఆంఽధ్రజ్యోతి) : యాసంగి సీజన్‌లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం చూపబోతోందని, కరువు రానుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం పెద్దబొంకూరు, కొత్తపల్లి, మూలసాల, బోజన్నపేట, హన్మంతునిపేట, మారేడుగొండ, గుర్రాంపల్లి, చీకు రాయి, పెద్దపల్లివ్యవసాయ మార్కెట్‌, చందపల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సూపర్‌ ఎల్‌నినో కారణంగా భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగిలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పం టలు పంటలను సాగు చేసుకోవాలన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ అం దిస్తున్నామన్నారు. రైతు పంట అమ్మిన రెండు రోజు ల్లోనే ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, కాం గ్రెస్‌ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంద న్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, విండో చైర్మన్‌ ముత్యాల నరేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు, విండో సీఈవో మధన్‌మోహన్‌, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 11:28 PM