Share News

పుష్కరాల పనుల డీపీఆర్‌ రూపొందించాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:13 AM

గోదావరి పుష్కర పనులకు సమగ్ర డీపీఆర్‌ రూపొందించనున్నట్టు రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, ఎస్‌కే కన్సల్టెంట్‌ ప్రతినిధి రంగారెడ్డితో కలిసి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్యలు పుష్కరాలు జరిగే గోదావరిఖని పుష్కరఘాట్‌, మల్కాపూర్‌ శివారు, సింగరేణి ఇన్‌టేక్‌ వెల్‌, జన గామ నదీ తీరాలను సందర్శించారు.

పుష్కరాల పనుల డీపీఆర్‌ రూపొందించాలి

కోల్‌సిటీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కర పనులకు సమగ్ర డీపీఆర్‌ రూపొందించనున్నట్టు రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, ఎస్‌కే కన్సల్టెంట్‌ ప్రతినిధి రంగారెడ్డితో కలిసి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్యలు పుష్కరాలు జరిగే గోదావరిఖని పుష్కరఘాట్‌, మల్కాపూర్‌ శివారు, సింగరేణి ఇన్‌టేక్‌ వెల్‌, జన గామ నదీ తీరాలను సందర్శించారు. డీపీఆర్‌ తయారు చేస్తున్న ఇంజనీర్లకు ప్రతిపాదిత పనులు జరుగాల్సిన ప్రాంతాలను చూపారు. ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలనే విషయంపై చర్చించారు. గోలి వాడలో జరుగాల్సిన పనులపై శంకర్‌రెడ్డి, హనుమాన్‌రెడ్డి, పొన్నం రామలింగంగౌడ్‌ తదితరులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మేయర్‌ మాట్లాడుతూ 12ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలకు గోదా వరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ తెలిపారని, దీనిలో భాగంగా పుష్కర ఘాట్ల నిర్మాణం, రహదారులు, ఇతర ఏర్పాట్లపై సమగ్ర డీపీఆర్‌ తయారు చేయాలన్నారు. ఆరు నెలల ముందే పను లు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఎమ్మె ల్యే సంకల్పమన్నారు. ఎస్‌ఈ గురువీర, డీసీ నాయిని వెంకటస్వామి, ఈఈ రామన్‌, డీఈలు షాబాజ్‌, జమీల్‌, చంద్రమౌళి, టీపీఎస్‌ నవీన్‌, ఇరిగేషన్‌ డీఈ శరత్‌బాబు, కార్పొరేటర్లు కంకణాల మౌనిక, దూళికట్ట సతీష్‌, వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, నాయకులు జనగామ నర్సయ్య, కృపాకర్‌రావు, మల్లేష్‌, జనగామ శివ, వాజిద్‌ఖాన్‌, సింగరేణి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): గోదావరి నది పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల నిర్మాణాలు ఉండాలని మేయర్‌ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు. గోలివాడ శివారులోని గోదావరి నదిని అధికారులతో కలిసి సందర్శించారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలోని నలుమూ లల నుంచి భక్తులు స్నానాలకు ఇక్కడకు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎలయ్య తోపాటు పలువురు కార్పొరేటర్లను స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.

Updated Date - Mar 06 , 2026 | 12:13 AM