డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:44 PM
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
జ్యోతినగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ బీఆర్‌ఎస్ హయాంలో బిల్లులు విడుదల కాకపోవడంతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులు నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను విడుదల చేసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి అర్హు లైన పేద కుటుంబాలకు ఇళ్లను అందజేస్తామని పేర్కొన్నారు. విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే ఇండ్లకు నాణ్యమైన రంగులు వేయాలని సూచించారు. పేదల సంక్షేమానికి కాం గ్రెస్ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందన్నారు. ప్రతీ పేద కుటుం బానికి గౌరవ ప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉం దన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. మేయర్ మహంకాళి స్వామి, ఇంచార్జి కమి షనర్ అరుణశ్రీ, ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు, డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులు పాల్గొన్నారు.