Share News

యాసంగిలో వరి సాగు చేయవద్దు..

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:42 PM

జిల్లాలో లోటు వర్షపాతం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తక్కువ నీటిమట్టం కారణంగా యాసంగి పంటకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని, రైతులందరూ వరి బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచిం చారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధి కారులతో యాసంగి పంట సాగుపై సమావేశం నిర్వ హించారు.

యాసంగిలో వరి సాగు చేయవద్దు..

పెద్దపల్లి, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లోటు వర్షపాతం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తక్కువ నీటిమట్టం కారణంగా యాసంగి పంటకు సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని, రైతులందరూ వరి బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచిం చారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధి కారులతో యాసంగి పంట సాగుపై సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో నీటిమట్టం తక్కువగా ఉందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు సరిపోతుందని పేర్కొ న్నారు. యాసంగి సాగుకు ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో విద్యుత్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేస్తే నీటి కొరతతో పాటు విద్యుత్‌ సమస్యలు ఎదురై పంట చివరి దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఒక ఎకరం వరి పంట సాగుకు అవసరమయ్యే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతువేదికలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉంటూ నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిని వివరించి సరైన పంటల ఎంపికపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతులు ఆర్థి కంగా నష్టపోకుండా ముందస్తుగా అప్రమత్తమై వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికను నీటి లభ్యతకు అనుగుణం గా రూపొందించాలన్నారు. జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి శ్రీని వాస్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:42 PM