డ్రైనేజీలపై గోడలు నిర్మించవద్దు
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:45 PM
రామగుండం నగరపాలక సంస్థ పరిధి లోని ప్రధాన నాలాలపై గోడలు నిర్మించవద్దని రామగుండం నగర మేయ ర్ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. కార్పొరేషన్ 52వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం డివిజన్ బాట నిర్వహించారు.
కోల్‌సిటీ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధి లోని ప్రధాన నాలాలపై గోడలు నిర్మించవద్దని రామగుండం నగర మేయ ర్ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. కార్పొరేషన్ 52వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం డివిజన్ బాట నిర్వహించారు. కళ్యాణ్‌నగర్, కాకతీయ నగర్‌లలో పూడిక తీత వీలుకాకుండా నాలాలపైనే ప్రహరీలు నిర్మించారని, దీంతో నాలాల్లోకి యంత్రాలు, పారిశుధ్య సిబ్బంది వెళ్లలేని పరిస్థితి ఉంద న్నారు. సోమవారం ఒక ప్రహరీని తొలగించి యంత్రాలను నాలాలోకి దిం చారు. కాకతీయనగర్ వరకు పూడిక తొలగించామని, సుమారు రూ.10 లక్ష ల విలువైన కార్పొరేషన్ యంత్రాలు, సిబ్బందితో చేయించామన్నారు. వివి ధ డివిజన్లలో ఇసుక, కంకర, ఇటుకలను రోడ్లపైనే పెడుతున్నారని, జరిమానా విధిస్తామన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్ చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, సూపర్‌వైజర్ దయానంద్ పాల్గొన్నారు.